ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయి సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన వాసు సందీప్ అనే యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. పాత ఆటోను కొని, దానిని టీ షాపుగా మార్చుకున్నాడు. వైరా పట్టణంలో హలో ఛాయ్ పేరుతో వ్యాపారం చేస్తూ రాణిస్తున్నాడు. మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.