ఈరోజుల్లో యువతులు బికినీలు వేసుకోవడం పెద్ద వింతేమీ కాదు కానీ.. సాధారణంగా యువతులు బీచ్‌లలో, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర బికినీలు వేసుకొని తమ అందాలను ఆరబోస్తుంటారు. ఏదైనా డెస్టినేషన్ ప్రాంతానికి వెళ్లినప్పుడు కూడా బికినీలు వేసుకొని హల్చల్ చేస్తారు.
కానీ.. ఈ యువతి చూడండి.. బికినీ వేసుకొని ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్ చేసింది. యూఎస్‌లోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఫేస్ మాస్క్ ధరించి.. బికినీ వేసుకొని హడావుడిగా బయలుదేరింది ఈ యువతి. వెనుక ఓ బ్యాగ్ వేసుకొని వెళ్తున్న ఆ యువతిని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్క్ పెట్టుకొని ఆమె బికినీలో వెళ్లడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. కరోనా ప్రబలుతున్న సమయం నుంచి మాస్క్‌ను ప్రపంచవ్యాప్తంగా కంపల్సరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో బికినీ వేసుకొని తన అందాలను అందరికీ చూపిస్తున్నా.. కరోనా జాగ్రత్తలు మాత్రం పాటించి.. మాస్క్ పెట్టుకొని ఆ యువతి రావడంపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Cake Cutting With iPhone : ఐఫోన్‌తో బర్త్‌డే కేక్ కట్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు.. వైరల్ వీడియో
ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
Viral Video : పళ్లతో రిబ్బన్ కట్ చేసిన మంత్రి.. వీడియో వైరల్
Sea Snake : వామ్మో.. సముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైరల్ వీడియో