మోకాల్లోతు మంచులో మనం నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో పెళ్లి పెట్టుకుంటే? అక్కడకు ఎలా వెళ్లాలి? ఇదే సమస్య ఒక పెళ్లికొడుకుకు వచ్చింది. దీనికి అతను ఒక వింత ఉపాయం ఆలోచించాడు.
మంచు కారణంగా రోడ్డు బ్లాక్ అయిందని, ఒక జేసీబీ బుక్ చేసుకున్నాడు. అందులో పెళ్లికూతురు ఇంటికి వెళ్లాడు ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో వెలుగు చూసింది. ఈ పెళ్లికొడుకు ఉపాయం వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన నెటిజన్లు భలే తెలివి చూపించాడంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా జేసీబీలో అమ్మాయి ఇంటికి వెళ్లిన తర్వాత, అక్కడ చేయాల్సిన తతంగం అంతా పూర్తి చేశారు. ఆ తర్వాత అమ్మాయిని కూడా జేసీబీలో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు.