Viral | నిమిషం గ్యాస్ వాడినందుకు రూ.19 వేల కోట్ల బిల్లు.. షాకైన జంట!
సాధారణంగా మనదేశంలో గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తాం. కానీ చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో ఎలక్ట్రిసిటీ మీటర్లలాగే గ్యాస్ మీటర్లు కూడా ఉంటాయి. ఇంటికి ఎల్లప్పుడూ గ్యాస్ సరఫరా ఉంటుంది. దానిలో ఎంత వాడుకున్నాం అనే దానిపై మన బిల్లు ఆధారపడి ఉంటుంది. శ్యామ్ మాట్రామ్, మ్యాడీ రాబర్ట్సన్ జంట ఉంటున్న ఇంటికి షెల్ కంపెనీ గ్యాస్ కనెక్షన్ ఉంది.
తాజాగా వారి యాప్‌లో చెల్లించాల్సిన బకాయిలను అప్డేట్ చేసినట్లు నోటిఫికేషన్ వచ్చింది. దానిలో ఆ రోజు ఉదయం ఒక నిమిషం గ్యాస్ వాడినందుకు చెల్లించాల్సిన బకాయిలు చూసి ఆ జంటకు గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే వారి యాప్‌లో 1.9 బిలియన్ యూరోలు అంటే మన లెక్కల్లో 19,146 కోట్ల రూపాయలు బిల్లు కట్టాలని ఉంది. అది కూడా ఉదయం వాడిన ఒక నిమిషానికే కావడం గమనార్హం.
ఈ జంట ఇంగ్లండ్‌లోని హార్పెండెన్ ప్రాంతంలో నివశిస్తోంది. సాధారణంగా ఏడాది పాటు గ్యాస్, ఎలక్ట్రిసిటీ వాడినందుకు వీళ్లకు వచ్చే బిల్లు 1300 యూరోలు అంటే మన లెక్కల్లో సుమారు రూ.లక్ష రూపాయలు. అలాంటిది ఈసారి ఏకంగా వేలకోట్ల రూపాయల బిల్లు రావడం చూసి షాకైన వాళ్లు..
‘‘నేను ఆ నెంబర్ సరిగా చూడలేదేమో అని మ్యాడీ అనుకుంది. కానీ తను కూడా చూశాక ఆశ్చర్యపోయింది. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని మాకు తెలుసు కానీ.. మరీ ఇంత పెరిగినట్లు అసలు ఊహించలేదు’’ అని శ్యామ్ చెప్పాడు. అయితే ఆ జంట ఇంత భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన పనిలేదని షెల్ ఎనర్జీ కంపెనీ తెలిపింది.

యాప్‌లో ఒక టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఈ అమౌంట్ చూపించిందని, ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని షెల్ కంపెనీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ‘‘మా యాప్ ఉపయోగించే అతికొద్ది మంది యూజర్లకే ఇలాంటి వింత అనుభవం ఎదురైంది. మొత్తం ప్రపంచానికి చేసే గ్యాస్ సరఫరా బిల్లు శ్యామ్, మ్యాడీ కట్టాలని మేం అనుకోవట్లేదు’’ అంటూ జోక్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

