Viral News | తొలిసారి విమానమెక్కిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ..!
Viral News | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ మొదటిసారి విమానం ఎక్కింది. టర్కీకి చెందిన 25 ఏళ్ల రుమెయ్సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. తాజాగా ఈమె తొలిసారి విమాన ప్రయాణం చేసింది. టర్కీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లింది. 13 గంటల పాటు విమానంలో ప్రయాణించింది.
Viral News | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ మొదటిసారి విమానం ఎక్కింది. టర్కీకి చెందిన 25 ఏళ్ల రుమెయ్సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. తాజాగా ఈమె తొలిసారి విమాన ప్రయాణం చేసింది. టర్కీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లింది. 13 గంటల పాటు విమానంలో ప్రయాణించింది. ఈమె కోసం టర్కిష్ ఎయిర్‌లైన్ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఆరు సీట్లను ఒక స్ట్రెచర్‌పైకి చేర్చి ఆమె పడుకునేకు అనువుగా ఉండేలా చూసింది.
ఈ విషయాన్ని రుమెయ్సా గెల్గీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ద్వారా తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌లైన్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ‘ఇది నా తొలి విమాన ప్రయాణం. నా ఈ మొదటి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. నాతోపాటు ప్రయాణించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రయాణం చివరిది కాకూడదని కోరుకుంటున్నా’’ అంటూ పోస్టు చేసింది. దీనిపై ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించింది. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తామంటూ తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా రుమెయ్సా గిన్నిస్ రికార్డు సాధించింది. ఈమె ఎత్తు ఏడు అడుగులు. అత్యంత పొడవైన వేళ్లు, వీపు కలిగిన మహిళగా ఈమె పేరిట రికార్డులున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

