క్రూర మృగం పులిని చూస్తే అందరూ హడలిపోతారు. అలాంటి పులికి ఓ ఎలుగుబంటి చుక్కలు చూపించింది. చెరువుకు సమీపంలో నిల్చున్న పులిని ఎలుగుబంటి చూసింది. కానీ ఎలుగుబంటి పారిపోలేదు. తన ముందరి కాళ్లతో నెమ్మెదిగా ముందుకు వచ్చి మూతిని చాచింది. దీంతో పులి భయపడి అటు నుంచి పరుగు పెట్టింది. అలా చెట్ల పొదల్లోకి పులి వెళ్లే వరకు ఎలుగుబంటి వెంబడించింది. 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రమేన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.