Odisha | గోపాల్పూర్ బీచ్లో 1,500 కిలోల టొమాటోలతో భారీ శాంటాక్లాజ్ బొమ్మ.. వైరల్ అవుతున్న ఫొటోలు
17 ఏళ్లుగా ప్రతి క్రిస్మస్కు శాంటాక్లాజ్ బొమ్మలు వేస్తున్న సుదర్శన్
Odisha : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడచూసినా శాంటాక్లాజ్ బొమ్మలు, క్రిస్మస్ చెట్లు కనువిందు చేస్తున్నాయి. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్బంగా ఒడిశాలోని గోపాల్పూరీ బీచ్లో టొమాటోలతో భారీ శాంటాక్లాజ్ బొమ్మ గీశాడు. దాని పక్కకన మెర్రీ క్రిస్మస్ అని రాశాడు. 27 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉన్న శాంటాక్లాజ్ బొమ్మ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ బొమ్మ కోసం సుదర్శన్ దాదాపు 1,500 కిలోల టొమాటోలు ఉపయోగించాడు. టొమాటోలతో చేసిన ఈ భారీ శాంతాక్లాజ్ శిల్పంతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తానని సుదర్శన్ చెప్పాడు. తన శిష్యులతో కలిసి ఈ బొమ్మ వేసినట్టు అతను వెల్లడించాడు.
పోయిన ఏడాది పూరీ బీచ్లో 50 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పు ఉన్న శాంటాక్లాజ్ బొమ్మ వేశాడు. అందుకోసం 5,400 గులాబీలు, ఇతర పూలను అతను ఉపయోగించాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన సుదర్శన్ గత 17 ఏళ్లుగా ప్రతి క్రిస్మస్కు శాంటాక్లాజ్ సైకత బొమ్మలు వేస్తున్నాడు. ప్రపంచంలోని ముఖ్యమైన సందర్భాలను పురస్కరించుకొని ఇతను సైకత శిల్పాలు వేస్తుంటాడు. ఈమధ్యే అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ డీగో మారడోనా రెండో వర్ధంతి సందర్భంగా అతడి బొమ్మ వేశాడు.
#TomatoSanta World’s biggest Tomato with Sand #SantaClause installation of 1.5 tons of Tamato at Gopalpur beach in Odisha , India. This sculpture is 27ft high, 60 ft wide. My students joined hand with me to complete the sculpture. #MerryChristmas2022 pic.twitter.com/s1cOeYQzEC
— Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

