వందేండ్ల వయసులో గిన్నీస్‌కు ఎక్కిన బామ్మ

న్యూయార్క్ : యాభై దాటగానే వయసైపోయిందని ఉసూరుమనే జనాలకు స్ఫూర్తినిచ్చేలా వందేండ్ల బామ్మ అవలీలగా బరువులు ఎత్తుతూ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ వెయిట్‌లిఫ్టర్ కాంపిటీటర్‌గా గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించింది. ఫ్లోరిడాకు చెందిన ఎడిత్ ముర్వే ట్రైనా (100) వయసులో సెంచరీ కొట్టినా తన సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటుతోంది. 15 నుంచి 60 కిలోల విభాగంలో బరువులు ఎత్తుతూ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
వయసులోఉన్నప్పుడు ఆమె స్ధానిక రిక్రియేషనల్ సెంటర్లో డ్యాన్స్ టీచర్‌గా పనిచేయగా, 91 ఏండ్ల వయసులో తన ఫ్రెండ్ కార్మన్ గట్వర్త్తో కలిసి వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకుంది. ఫ్రెండ్ ప్రోద్బలంతో జిమ్‌లో అడుగుపెట్టిన బామ్మ ట్రైనా అక్కడ వెయిట్ లిఫ్టింగ్‌ను ట్రై చేసింది. మెల్లగా బరువులు ఎత్తడం నేర్చుకున్న ఆమె ఆపై కఠోర శిక్షణ తీసుకుని ప్రొఫెషనల్‌గా మారింది.
అంకిత భావం, పట్టుదలతో ట్రైనా ఎన్నో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని బహుమతులు సాధించింది. మీరు శ్రమించినంత కాలం మీ వయసు ఎంతనేది విషయం కాదని ఆమె చెప్పుకొచ్చింది. ట్రైనా వెయిట్‌లిఫ్టింగ్ వీడియో వైరల్‌గా మారగా బామ్మ పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. మీరు 100 ఏండ్లు కాదు మరో 50 ఏండ్లు అయినా ఇలాగే ఉంటారని ఓ యూజర్ కితాబిచ్చాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

