Viral Video : కీమోథెరఫీ సెషన్ సందర్భంగా క్యాన్సర్ రోగిని సంతోషంగా ఉంచేందుకు నర్స్ చేసిన పనికి నెట్టింట ఆమెపై పలువురు ప్రశంసలు గుప్పించారు. క్యాన్సర్ రోగితో నర్స్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొలంబోలోని ఓ ఆస్పత్రి నుంచి ఈ క్లిప్‌ను రికార్డు చేశారు. ఈ వీడియో ను గుడ్‌న్యూస్ కరస్పాండెంట్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
కీమోథెరఫీ సెషన్‌ను ఏమాత్రం నొప్పిలేకుండా సంతోషంగా భరించేలా రోగులను సిద్ధం చేసే క్రమంలో ఆస్పత్రి ఈ ఏర్పాట్లు చేసింది. నర్స్‌తో జేసన్ డ్యాన్స్ చేస్తుండగా ఇతర రోగులు చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.
వార్డ్‌ను బెలూన్స్‌తో అందంగా అలంకరించారు. జేసన్ కీమోథెరఫీ సెషన్స్‌లో రూంలో ఒక్కరే ఉంటుండగా, ఈసారి విభిన్నంగా సెషన్‌ను నిర్వహించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. అద్భుతం..ఈ ప్రపంచంలో నర్స్‌లు దేవతలని ఓ యూజర్ కామెంట్ చేయగా రోగి పట్ల నర్స్ చూపిన కేర్ అసమానమని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :