ఆకాశంలో వింతగా గ్రీన్ లైట్… ఏలియన్ దాడిగా నెటిజన్ల అనుమానం
కేప్ టౌన్: ఆకాశంలో వింతగా గ్రీన్ లైట్ కనిపించింది. దీంతో ఏలియన్ దాడిగా నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటలకు ఆకాశంలో ఆకుపచ్చ రంగులో కాంతి కనిపించింది. గ్రీన్ రంగులోని గ్రహశకలం మాదిరిగా ఇది ఉన్నట్లు దీనిని చూసిన కొందరు తెలిపారు. స్కాట్స్విల్లే, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ ప్రాంతాల్లో ఈ వింత కాంతిని చూసినట్లు చాలా మంది ఫేస్బుక్లో పేర్కొన్నారు. ‘ఇది నిజంగా విచిత్రమైన దృశ్యం. మెరుస్తున్న లైట్లతో ఉన్న వస్తువును చూశాను’ అని మెరీనా అనే మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తన సోదరికి చెప్పానని, అయితే ఆమె నమ్మలేదని అందులో పేర్కొంది.
మరోవైపు, దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఆకాశంలో కనిపించిన ఆకుపచ్చ రంగు కాంతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేశారు. ‘ఏలియన్లు వచ్చేశాయి. అవి దాడి చేస్తున్నాయి’ అని ఒకరు కామెంట్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

