‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు’..కేజీఎఫ్ సినిమాలోని ఈ డైలాగ్‌కు కరెక్ట్‌గా ఈ వీడియో సరిపోతుంది. ఇంతకుముందు పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు తండ్రులు కాపాడిన వీడియోలు మనం ఎక్కువగా చూశాం. కానీ, కొడుకు స్విమ్మింగ్ ఫూల్లో పడిపోతుండగా కాపాడిన తల్లి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘ది ఫిగెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో బాలుడు స్విమ్మింగ్ ఫూల్ ఎడ్జ్‌లో ఉంటాడు. అందులో దూకేందుకు ముందుకు వంగుతాడు. ఇంతలోనే గమనించిన తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి కొడుకును ఒంటిచేత్తో పట్టేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆ తల్లిని మెచ్చుకుంటారు. ఈ ఏడాదిలో ఉత్తమ తల్లి ఈమేనని కామెంట్ చేస్తున్నారు. కాగా, 9 సెకన్ల నిడివిగల ఈ క్లిప్‌ను ఇప్పటివరకూ 4.6లక్షల మంది వీక్షించారు.
Mother of the year!👏 pic.twitter.com/TIXn8P85gx
— Figen (@TheFigen) April 30, 2022