సోషల్‌మీడియాలో ఎన్నో సాహస వీడియోలు చూస్తుంటాం. ఒక్కొక్కరు ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడుతుంటారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ కారు అదుపుతప్పి ఓ ఇంటివైపు వెళ్తుండగా ఓ వ్యక్తి చేసిన సాహసం నెటిజన్లను కట్టిపడేసింది.
ఈ వీడియోలో ఒక మహిళ నిర్మానుష్య వీధిగుండా నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఆమె వెళ్లిపోగానే వెనుకే ఓ కారు అదుపుతప్పి ఓ ఇంటివైపు దూసుకెళ్తుంటుంది. దాని వెనుక పరుగెత్తుతూ వచ్చిన ఇద్దరి వ్యక్తుల్తో ఒకరు చాకచక్యంగా కిటికీగుండా కారులోకి ప్రవేశించి హ్యాండ్‌బ్రేక్ వేస్తాడు. దీంతో ఆ కారు జీబ్రాక్రాసింగ్కు కొన్ని మీటర్ల దూరంలోనే నిలిచిపోతుంది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.