ముంబై : జన్మాష్టమిని ఈనెల 19న దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులను చిన్ని కృష్టుడిగా ముస్తాబుచేసి తల్లులు మురిసిపోయారు. ఇక ఉట్టికొడుతూ యువత కేరింతలతో పండుగ జోష్ నింపారు. ఇదే తరహాలో మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక దహి హండి ఈవెంట్లో ఓ యువకుడు ఉట్టి కొట్టడంలో విఫలమైన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 23 సార్లు ఉట్టిని పట్టుకుని గట్టిగా కొట్టినా మట్టి పాత్రను పగులగొట్టలేక చేతులెత్తేయడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వైరల్ వీడియోలో జనం పై నుంచి ఎక్కిన వ్యక్తి పెద్ద రాయితో ఉట్టిని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు.
ఎంతసేపటికి ఉట్టిని బ్రేక్ చేయలేకపోవడంతో మరో వ్యక్తి 23 సార్లు రాయితో గట్టిగా కొట్టినా ఉట్టి పగలలేదు. ఎంతచేసినా ఉట్టిని కొట్టలేకపోయారు అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ తెగ వైరలవుతోంది.