రక్తం జ్యూస్‌ను తాగారా ఎప్పుడైనా? ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే.. వైరల్ వీడియో
రక్తం జ్యూస్‌ను తాగారా ఎప్పుడైనా? | ఛీ.. రక్తం జ్యూస్ తాగడం ఏంటి.. అంటారా? అప్పుడే అంత తొందరపడకండి. ఎందుకంటే అది నిజంగా రక్తంతో చేసిన జ్యూస్ కాదు.
ఛీ.. రక్తం జ్యూస్ తాగడం ఏంటి.. అంటారా? అప్పుడే అంత తొందరపడకండి. ఎందుకంటే అది నిజంగా రక్తంతో చేసిన జ్యూస్ కాదు. ఖూనీ గన్నె కా జ్యూస్ అంటే.. చెరుకుతో చేసిన రక్తం లాంటి జ్యూస్ అన్నమాట. చెరుకు రసం తాగారు కదా.. కాకపోతే.. అందులోనే ఇది వెరైటీ జ్యూస్ అన్నమాట.

దీన్ని ఎలా తయారు చేస్తారంటే.. ముందు చెరుకు గడలు, పూదీనతో కలిసి జ్యూస్ చేసి.. ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ చేస్తారు. ఈరెండు జ్యూస్‌లను కలిపేస్తారు. దాన్ని సాధారణంగా బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసే పౌచ్‌లో పోసి ఇస్తారు. దాన్ని అలాగే.. రక్తం ప్యాకెట్లా ఉండే పౌచ్‌లోనే తాగాల్సి ఉంటుంది. చూడటానికి అచ్చం రక్తంలా ఉంటుంది ఆ జ్యూస్. అందుకే దాన్ని ఖూనీ కా జ్యూస్ అని పేరు పెట్టారు. అందులో చెరుకు రసం కూడా కలుపుతారు కాబట్టి.. ఖూనీ గన్నే కా జ్యూస్ అని పేరు పెట్టారు.
ఇంతకీ ఈ జ్యూస్ ఎక్కడ దొరుకుతుంది అంటారా? యూపీలోని ఘజియాబాద్‌లో. ఫ్రూట్ కేన్ పేరుతో ఈ సరికొత్త జ్యూస్‌ను ఓ వ్యక్తి అమ్ముతున్నాడు. ఈ జ్యూస్.. ఫుడ్ బ్లాడర్ విశాల్ కంట పడటంతో.. ఆయన ఆ జ్యూస్ వీడియోను తన యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జిమ్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. కసరత్తులు చేస్తూ ఫోటోలు దిగిన పెళ్లికూతురు.. వీడియో వైరల్
చిందరవందరగా బెడ్రూమ్.. కాంపిటిషన్లో గెలిచిన 8 ఏళ్ల బాలిక.. ఫోటోలు వైరల్
వరద నీటిలో నడవడం కోసం భలే ఐడియా.. నువ్వు తోపు అంటున్న నెటిజన్లు
నడవడం ఇష్టం లేక అంబులెన్స్‌కు ఫోన్.. 39 సార్లు ఫ్రీ ట్యాక్సీలా వాడుకున్నాడు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

