Beauty Pageant | అందాల పోటీల్లో తన భార్య రెండో స్థానంలో నిలవడంతో.. కిరీటాన్ని నేలకేసి కొట్టిన వ్యక్తి
Beauty Pageant | అందాల పోటీల్లో (Beauty Pageant ) తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి కిరీటాన్ని (Crown) నేలకేసి కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్ (Brazil )లో చోటు చేసుకుంది.
Beauty Pageant | అందాల పోటీల్లో (Beauty Pageant ) తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి కిరీటాన్ని (Crown) నేలకేసి కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్ (Brazil )లో చోటు చేసుకుంది. స్థానిక వార్తా సంస్థ గ్లోబో వెల్లడించిన వివరాల ప్రకారం..
బ్రెజిల్లో మిస్ గే మాటో గ్రాసో 2023 (Miss Gay Mato Grosso 2023) అందాల పోటీలు శనివారం ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చివరకు నథాలీ బెకర్ (Nathally Becker), ఇమ్మాన్యుయెల్ బెలీని (Emannuelly Belini) ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉత్కంఠకు తెరదించుతూ విజేతను ప్రకటించారు. వీరిద్దరిలో బెలీని అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు కిరీటాన్ని పెట్టేలోపే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నథాలీ బేకర్ భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక్కసారిగా స్టేజ్‌పైకి దూసుకొచ్చి నానా హంగామా చేశాడు. తన భార్యకు అన్యాయం జరిగిందంటూ విజేతకు పెట్టబోయిన కిరీటాన్ని లాక్కుని రెండు సార్లు నేలకేసి కొట్టాడు. అక్కడున్నవారిపై అరుస్తూ.. తన భార్యను పక్కకు లాక్కెళ్లాడు.
అతని చర్యకు వీక్షకులు, నిర్వాహకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతన్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. భార్యకు అన్యాయం జరిగిందని భావించి అతను అలా ప్రవర్తించాడని వివరణ ఇచ్చారు. అయితే న్యాయ నిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.
Revolta na final do concurso Miss Brasil Gay 2023. Torcedor arranca coroa da vencedora e joga no chão durante a cerimônia de premiação. pic.twitter.com/rb6duFvAEn
— Guzzo Informa (@guzzoinforma) May 28, 2023
Also Read..
Al Pacino | 29 ఏళ్ల ప్రేయసితో.. నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్ నటుడు
Project K | ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో కమల్ హాసన్..? రూ. వంద కోట్లకుపైనే రెమ్యూనరేషన్..?
MS Dhoni | ధోనీ భవిష్యత్తు నాయకుడు.. రాజకీయాల గురించి ఆలోచించాలి : ఆనంద్ మహీంద్రా
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

