Project K | ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో కమల్ హాసన్..? రూ. వంద కోట్లకుపైనే రెమ్యూనరేషన్..?
Project K | ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె (Project k) ఒకటి . సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Project K | ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె (Project k) ఒకటి . సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ నటుడు ప్రాజెక్ట్ కె లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ‘ప్రాజెక్ట్ కె’ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కమల్ ప్రతినాయకుడి (negative character) పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాలో ఆయన కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమే అని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ప్రతినాయకుడి పాత్రకు కమల్ ఏకంగా రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె , దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని.. 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ కల్లా ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అనుకున్న టైమ్ లైన్ ప్రకారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్న ‘సలార్’ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. దీంతోపాటు మారుతి హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పై ఉంది.
Also Read..
MS Dhoni | ధోనీ భవిష్యత్తు నాయకుడు.. రాజకీయాల గురించి ఆలోచించాలి : ఆనంద్ మహీంద్రా
Mahesh Babu | ఇది నీకోసమే నాన్నా.. కృష్ణ మొదటి జయంతి సందర్భంగా మహేశ్ ఎమోషనల్ పోస్ట్
Al Pacino | 29 ఏళ్ల ప్రేయసితో.. నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్ నటుడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

