లా విద్యార్థి వినూత్న ఆలోచన… పెన్నులపై మాస్ కాపీయింగ్.. చివరకు ఏమైందంటే!
Law Student | పరీక్షలు వచ్చాయంటే చాలు విద్యార్థులకు గుబులు పుడుతుంది. పరీక్షల్లో తప్పితే ఇంట్లో వాళ్లు కొడతారనో, తిడతారనో ఎలాగైనా పాసవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కి పాల్పడుతుంటారు. చిట్టీలు పెట్టుకోవడం, చేతులపై, కాళ్లపై రాసుకుని పరీక్ష హాల్‌కు వెళ్లి ఉపాధ్యాయులకు దొరికిపోతుంటారు.
Law Student: పరీక్షలు వచ్చాయంటే చాలు విద్యార్థులకు గుబులు పుడుతుంది. పరీక్షల్లో తప్పితే ఇంట్లో వాళ్లు కొడతారనో, తిడతారనో ఎలాగైనా పాసవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కి పాల్పడుతుంటారు. చిట్టీలు పెట్టుకోవడం, చేతులపై, కాళ్లపై రాసుకుని పరీక్ష హాల్‌కు వెళ్లి ఉపాధ్యాయులకు దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
స్పెయిన్‌లో లా చదివే ఓ విద్యార్థి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా…? కొత్తగా అనిపించకపోవచ్చు కానీ అతను ఎంచుకున్న విధానం కొత్తది. బ్లూ క్యాప్ ఉన్న 11 పెన్నులను తీసుకుని వాటి చుట్టూ చిన్న అక్షరాలతో జవాబులను రాసుకెళ్లాడు. పరీక్ష సమయంలో కాపీకొడుతుండగా ఉపాధ్యాయులకు దొరికిపోయాడు.
సాధారణంగా వాటిని చూస్తే పెన్నులే గా అనుకుంటాం… కానీ, కంటికి దగ్గరా పరిశీలిస్తే తప్ప వాటిపై ఉన్న అక్షరాలు మనకు కనిపించవు. విద్యార్థి మాస్ కాపీయింగ్ కోసం ఉపయోగించిన పెన్నులు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు విద్యార్థి ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలా కూడా కాపీ కొట్టచ్చా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Haciendo orden en mi despacho he encontrado esta reliquia universitaria que confiscamos a un alumno hace unos años: el derecho procesal penal en bolis bic. Que arte! #laschuletasnosoncomoantes pic.twitter.com/3J4LMn0RQF
— Yolanda De Lucchi (@procesaleando) October 5, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

