కోల్కతా: దేశంలో కూడా గే జంటలు పెళ్లితో ఒక్కటవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన ఇద్దరు పురుషులు ఆదివారం ఘనంగా పెళ్లి చేసుకున్నారు. తమ మధ్య ఉన్న అసహజ సంబంధాన్ని మూడు ముళ్ళ బంధంతో శ్వాశతం చేసుకున్నారు. గే జంట అయిన అభిషేక్ రే, చైతన్య శర్మ పెళ్లితో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి తంతును సంప్రదాయంగా నిర్వహించారు.
అభిషేక్ ధోతీ, కుర్తాలో సాంప్రదాయ బెంగాలీ వరుడిలా ముస్తాబుకాగా, చైతన్య శర్మ షేర్వాణీ ధరించాడు. మంగళ స్నానాలు (హల్దీ)తో పాటు పెళ్లి తంతును స్వలింగ జంట ఆనందంతో జరుపుకుంది. ఒకరి మెడలో మరొకరు పూల దండలు వేసుకున్నారు. అరుదైన ఈ వింత వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చైతన్య తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లో కూడా ఒక గే జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్లో సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన సోఫియా డేవిడ్ అనే ట్రాన్స్జంటర్ ఈ వేడుకను నిర్వహించింది.