బెంగాల్ గోపాల్ పూజా మండపంలో కచ్చా బాదాం సింగర్ భుబన్ బద్యాకర్ విగ్రహం.. ఫొటోలు వైరల్!!
పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఎక్కడికెళ్లినా భుబన్ బద్యాకర్ పేరే వినిపిస్తుంది. అతడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కాగా, హోలీ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించే పూజల్లో ఏకంగా అతడి విగ్రహాన్నే పెట్టేసారు.
ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా కచ్చా బాదాం పాటనే వినిపిస్తున్నది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆ బెంగాల్ పాటకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇన్స్టాగ్రాంనూ ఈ పాట ఊపేస్తున్నది. పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో పచ్చి పల్లికాయ అమ్ముకుంటూ తిరిగే భుబన్ బద్యాకర్ ఓవర్నైట్ సెలబ్రిటీ అయిపోయాడు.

పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఎక్కడికెళ్లినా భుబన్ బద్యాకర్ పేరే వినిపిస్తుంది. అతడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కాగా, హోలీ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించే పూజల్లో ఏకంగా అతడి విగ్రహాన్నే పెట్టేసారు. ఉత్తర కోల్కతాలోని ‘గోపాల్ పూజ’ పండల్లో ఏర్పాటు చేసిన అతడి విగ్రహానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ విగ్రహాన్ని కుమార్తులికి చెందిన పరిమల్ పాల్ అనే కళాకారుడు రూపొందించాడు. ‘గోపాల పూజ’ కోసం 5.5 అడుగుల భుబన్ బద్యాకర్ విగ్రహాన్ని రూపొందించినట్లు పరిమల్పాల్ తెలిపాడు. ఈ విగ్రహం తయారీకి నాలుగు రోజుల సమయం పట్టిందని చెప్పాడు. పండుగ ముగిసిన తర్వాత విగ్రహాన్ని కుమార్తులిలోని తన స్టూడియోలో పెట్టుకుంటానని పాల్ తెలిపాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

