Harsh Goenka | ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ ఆసక్తికర విషయాలు, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర వీడియోతో అందరి ముందుకు వచ్చారు. ఓ స్వీట్స్ షాప్ వారు తయారు చేసిన బాహుబలి సమోసాకు సంబంధించిన వీడియోను గోయెంకా తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘‘దీపావళి స్వీట్స్ అన్నీ అయ్యాక, ఈరోజు ఒకటి కంటే ఎక్కువ సమోసాలు తినకూడదని నా భార్య నన్ను ఆదేశించింది..’’ అంటూ సరదాగా చమత్కరించారు.
ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన కౌషల్ స్వీట్స్ షాప్‌వారు ఆలూ, బఠానీ, డ్రై ఫ్రూట్స్, ఛీజ్‌తో ఈ భారీ సమోసాను తయారు చేశారు. దీని బరువు 8 కేజీలుకాగా, ధర రూ,1,100. ఈ సమోసాను ఎనిమిది మంది తినగలరట. అయితే, స్వీట్స్ షాప్ యజమాని ఆహార ప్రియులకు బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. ఈ బాహుబలి సమోసాను 30 నిమిషాల్లో తిన్న వారికి రూ.51,000 ఫ్రైజ్ మనీ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
After all the Diwali sweets, my wife has ordered me to eat not more than one samosa today…… pic.twitter.com/WjuRObFD0T
— Harsh Goenka (@hvgoenka) October 26, 2022