Viral Video | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేడుకలకు సంబంధించి కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. పాత పద్ధతులను పాటించేవారు చాలా అరదుగా కనిపిస్తున్నారు. వివాహాది వేడుకలైతే మరీనూ.. మునపటిలా ఎక్కడా జరగడం లేదు. కుటుంబ సభ్యులు, బంధువులే కాదు.. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు సైతం కొత్తగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటున్నారు.
సాధారణంగా వివాహ వేదిక వద్దకు పెళ్లి కుమార్తె కానీ, పెళ్లి కుమారుడు కానీ.. అందంగా అలంకరించిన కారు, గుర్రపు బండి, బైక్, సైకిల్‌పైన రావడం చూశాం. కానీ, అమెరికాకు చెందిన ఓ పెళ్లి కుమారుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. ఎవ్వరూ ఊహించని విధంగా పెళ్లి మండపానికి వచ్చాడు. ఇంతకీ అతను ఎందులో వచ్చాడో తెలుసా..? శవపేటికలో. అవును, మీరు చదివింది నిజమే. అతను శవపేటికపై వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. కొత్తదనం కోసం అలా చేశారో.. మరి సాంప్రదాయంలో భాగంగా చేశారో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.