Viral news : సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లు, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండేవాళ్లు ఇంటి పని కోసం, వంట పని కోసం పని మనిషిని పెట్టుకుంటారు. కానీ యూపీలోని ఘజియాబాద్ (Ghaziabad) లో ఓ పని మనిషి చేసిన గలీజ్ పనిని చూస్తే.. ఎవరైనా పని మనిషిని పెట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఆ పని మనిషి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ పని మనిషి ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లో ఓ పనిమనిషి జుగుప్సాకరమైన పని చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఆ మహిళ గత 8 ఏళ్లుగా పనిచేసింది. ఇంటి యజమానులకు ఆమెపై నమ్మకం పెరిగింది. దాంతో అన్నీ ఆమెకు నమ్మి వదిలేసేవారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆ ఇంట్లోంచి కూరగాయలు, ఇతర వస్తువులు మాయమవుతున్నాయి. దాంతో వారికి పని మనిషిపై అనుమానం వచ్చింది.
దాంతో ఇంటి యజమాని రహస్యంగా తన మొబైల్ కెమెరాను ఆన్ చేసి ఏమీ ఎరగనట్టుగా తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. పని మనిషి వెళ్లిపోయిన తర్వాత ఆ వీడియోను చెక్ చేసిన యజమానికి మైండ్ బ్లాక్ అయ్యింది. వ్వాక్.. అంటూ వాంతి చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే పనిమనిషి ఓ పాత్రలో మూత్రం పోసి ఆ మూత్రంలోనే పిండి పిసికింది. ఆ పిండితోనే రొట్టెలు చేసింది.
ఆ రొట్టెలనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పిల్లలు తిని, బాక్సులో పెట్టుకుని స్కూల్‌కు వెళ్లారు. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి స్కూల్‌కు ఫోన్ చేసి తమ పిల్లల బాక్సుల్లోని రోటీలను పారవేయమని చెప్పాడు. పని మనిషిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా తాను అలాంటి పని చేయలేదని బుకాయించింది.
దాంతో పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన వీడియోను చూపించగా నేరాన్ని అంగీకరించింది. దాంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పని మనిషి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత జుగుప్సాకరమైన పని చేసిన పనిమనిషి కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
UP के ग़ाज़ियाबाद में 8 साल से घर में काम करने वाली नौकरानी रीना पर आरोप है की वह किचन में ही बर्तन के अंदर मूत्र विसर्जन करके मूत्र में ही आटा गूंथ रोटी बनाती थी। वीडियो सामने आने के बाद नौकरानी रीना को गिरफ्तार कर लिया गया है बताया जा रहा है की पूरा परिवार कई साल से बीमार है।… pic.twitter.com/Zp8mxrzJCx
— ONN18 NEWS (@newsonn18) October 16, 2024