పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. క్రమంగా పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరువయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించే ఆలోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు ముగ్గురు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. గతేడాది కరోనా సమయంలో ముడి చమురు ధరలు పతనమవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వెళ్లింది. అయితే గత పది నెలలో ఈ ధరలు రెట్టింపయ్యాయి. ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రిటెయిల్ ధరల్లో 60 శాతం పన్నులు, డ్యూటీలే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా గండి పడకుండా సామాన్యులపై పన్నుల భారం తగ్గించడం ఎలాగన్న అంశంపై పలు రాష్ట్రాలు, ఆయిల్ కంపెనీలు, సంబంధిత మంత్రిత్వ శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సదరు అధికారులు తెలిపారు. ఈ మధ్యే పన్నుల తగ్గింపుపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన విషయం తెలిసిందే. పన్నులను ఎప్పుడు తగ్గిస్తామో తెలియదు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నదని ఆమె అన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

