న్యూఢిల్లీ : జింకను వెంటాడుతున్న మొసలి వీడియోను ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో జింక నది దాటుతుండగా మొసలి దాన్ని వెంబడించడం కనిపిస్తుంది. ఈ వీడియో క్లైమాక్స్ టాప్ క్లాస్ అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.
A TOP class climax !
🥰 pic.twitter.com/17jDM9cNpY— Vinod Kapri (@vinodkapri) February 6, 2023
ఈ వైరల్ వీడియోను తొలుత విస్డమ్ ఆఫ్ ది లయన్ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. 50 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో జింకను మొసలి ఛేజ్ చేయడం కనిపిస్తుంది.
వీడియో చివరిలో జింకకు అతిదగ్గరగా వెళ్లిన మొసలి దాన్ని దాదాపు మింగేయబోతుండగా జింక అతివేగంతో దాని బారి నుంచి తప్పించుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుతుంది. ఏ టాప్ క్లాస్ క్లైమాక్స్ క్యాప్షన్‌తో కాప్రి ఈ వీడియోను షేర్ చేయగా ఈ వీడియోను ఇప్పటివరకూ 18.000 మందికి పైగా వీక్షించారు.