Viral Video | సాధారణంగా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు..? కత్తెర లేదా ట్రిమ్మర్‌ను వినియోగిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కుమారుడికి టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాడు. వింతగా ఉంది కదూ..? మీరు విన్నది నిజమే.
టేబుల్ స్పూన్‌తో ఎంతో చక్కగా హెయిర్ కట్ చేసి వావ్ అనిపించుకుంటున్నాడు. ఆ స్పూన్‌తో తన కొడుకుకి ఏకంగా గుండు కొట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ari rover అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘నేను మా అబ్బాయికి కిచెన్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాను. మనందరం ఇప్పుడు జుట్టు కత్తిరించడంలో మ్యాజిక్ చేస్తున్నాం’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇదేలా సాధ్యం..? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.