కొన్నిసార్లు జంతువులు వింతగా ప్రవర్తిస్తాయి. వాటి ప్రవర్తనకు కారణం ఏంటి? అనేది కొన్నిసార్లు అంతు చిక్కదు. అచ్చం చైనాలో కూడా ఈమధ్యే ఇలాంటి సంఘటనే జరిగింది. దాదాపు 100కి పైగా గొర్రెలు ఒక వీడియోలో గడియారం ముల్లులాగా కుడి నుంచి ఎడమవైపు వలయాకారంలో నడుస్తూ కనిపించాయి. ఒకటి రెండు రోజులు కాదు 12 రోజులు వరుసగా ఆ గొర్రెలు ఒకే స్థలంలో గుండ్రంగా నడిచాయి. రెండు రోజుల క్రితం ఈ వీడియోను పీపుల్స్ డెయిలీ చైనా ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. దాంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైనాలోని మొంగోల్ ప్రాంతంలో ఈ వింత చోటుచేసుకుంది. మొదటగా కొన్ని గొర్రెలు గుండ్రంగా నడవడం మొదలుపెట్టాయి. అవి అలా చేయడం చూసి మిగతా గొర్రెలు వాటిని అనుసరించాయి అని ఆ గొర్రెల మంద కాపరి చెప్పాడు. వీడియోలో మధ్యలో ఉన్న గొర్రెలు కదలకుండా నిల్చొని ఉన్నాయి. మిగతావి బయట ఉండి గుండ్రంగా నడుస్తున్న గొర్రెలను గమనించసాగాయి. ఆ గొర్రెలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. అవి అలా వింతగా ప్రవర్తించడానికి కారణం ఏంటనేది తెలియలేదు అని మొంగోల్కు చెందిన చెందిన ఒక మెడికల్ సంస్థ చెప్పింది.
The great sheep mystery! Hundreds of sheep walk in a circle for over 10 days in N China’s Inner Mongolia. The sheep are healthy and the reason for the weird behavior is still a mystery. pic.twitter.com/8Jg7yOPmGK
— People’s Daily, China (@PDChina) November 16, 2022