కచ్చాబాదాం పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు చెందిన పచ్చిపల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ ఈ పాట పాడిన విషయం తెలిసిందే. ఈ పాటతో భుబన్ ఓవర్‌నైట్ సెలెబ్రిటీ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా సెలెబ్రిటీలు, నెటిజన్లు ఈ పాటపై స్టెప్పులేసి సోషల్‌మీడియాలో పెడుతున్నారు. తాజాగా ఓ మహిళ ఈ పాటపై నాగిని స్టెప్స్ వేసి, అందరినీ నవ్వించింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాలో ‘బటర్ ఫ్లై’ అనే యూజర్ అప్లోడ్ చేశారు. నీలిరంగు చీరలో ఉన్న మహిళ పెళ్లి బరాత్‌లో ఈ పాటపై స్టెప్పులేసింది. నాగిని స్టెప్పులేసి అలరించింది. ఆమె డ్యాన్స్ చూసి అంతా ఎంజాయ్ చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 16వేల మంది చూశారు. సరదా కామెంట్లు చూశారు.