Viral Video | బేబీ షవర్ వేడుకలో భర్తతో కలిసి గర్భిణి డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా..!
బేబీ షవర్ వేడుకలో ఓ గర్భిణి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరి మనసుల్ని దోచుకుంది. సీమంతం వేడుకలో తన భర్తతో కలిసి ఎంతో యాక్టివ్‌గా డ్యాన్స్ చేసింది.
Viral Video | తల్లిదండ్రులుగా ప్రొమోషన్ పొందే క్షణాలు ఎంతో అపురూపం. ఏ జంటైనా ఆ మధుర క్షణం కోసం వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. ఇక భార్య గర్భవతి అని తెలిసిన క్షణం భర్త సహా ఇంటిల్లిపాదీ ఆనందంతో పండగ చేసుకుంటారు. గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారికి జన్మనిచ్చే వరకూ ఆ ఇల్లాలిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఆ సమయంలో గర్భిణి కోరికలను తీరుస్తుంటారు. ముఖ్యంగా ఇరు కుటుంబ సభ్యులు కలిసి సీమంతం వేడుకను ఘనంగా జరిపిస్తుంటారు.
అయితే, సాధారణంగా గర్భిణి మహిళ మునుపటిలా చలాకీగా తిరిగేందుకు కాస్త ఇబ్బంది పడుతుంది. అలాంటిది ఓ గర్భిణి మాత్రం తన బేబీ షవర్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరి మనసుల్ని దోచుకుంది. సీమంతం వేడుకలో తన భర్తతో కలిసి ఎంతో యాక్టివ్‌గా డ్యాన్స్ చేసింది. కింగ్ సినిమాలోని ‘మాన్ మేరీ జాన్’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు గర్భిణి డ్యాన్స్‌కు ఫిదా అవుతూ.. కామెంట్లు పెడుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

