పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దాన్ని చూడగానే నోరూరుతుంది. లొట్టలేసుకుంటూ తినేస్తాం. పెద్దలే కాదు.. పిల్లలకు కూడా పిజ్జాను చూడగానే నోరూరుతుందని నిరూపించాడు ఈ పిల్లాడు. వయసు 3 ఏళ్లు కూడా ఉంటాయో లేదో తెలియదు కానీ.. తండ్రి ఆర్డర్ చేసిన పిజ్జా రాగానే.. దాన్ని చూసి అస్సలు ఆగలేకపోయాడు.
తండ్రి పిజ్జాను ఓపెన్ చేయగానే.. దాన్ని చూసి ముందు నోరెళ్లబెట్టాడు. ఆ తర్వాత దాన్ని చూస్తూ.. నోరు చాచి.. చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశాడు. దాన్ని తినకముందో.. ఆ పిల్లాడు అలా అయితే.. దాన్ని తిన్నాక ఇంకెలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడో.. మొత్తానికి ఆ పిల్లాడి ఎక్స్ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిజ్జాను చూడగానే.. ఎలా చేస్తున్నాడో చూడండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : హెయిర్ కట్ చేయనీయకుండా గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. బార్బర్ ఏం చేశాడంటే?