ఫుట్‌బాల్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో డాస్ శాంటాస్ అవీరో పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతడు పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుంచి కెప్టెన్. జువెంటస్ క్లబ్‌కు ఫార్వర్డ్ స్థానంలో ఆడుతాడు. మైదానంలో పుట్‌బాల్‌తో వివిధ విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటాడు. అయితే, రొనాల్డోకు ఇప్పుడు ఓ కోడి పోటీకి వచ్చింది. గుడ్డును ఫుట్బాల్లా ఆడుకుంటున్న ఓ కోడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో గుడ్డును కోడి కాళ్లపైనుంచి మెడపైకి, అక్కడినుంచి రెక్కలపైకి, కాళ్లపైకి తిప్పుతూ ఉంటుంది. అచ్చం రొనాల్డోలాగా విన్యాసాలు చేస్తుంది. అయితే, ఇది ఎడిట్ చేసిన వీడియో అని క్లియర్‌గా తెలిసిపోతున్నది. అయినా నెటిజన్లు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కోడిముందు క్రిస్టియానో రొనాల్డో కూడా పనిచేయడని సరదా కామెంట్లు చేస్తున్నారు.