BTS : ఏడుగురు సభ్యుల కొరియన్ బాయ్ బ్యాండ్ బీటీఎస్ (బ్యాంగ్టన్ బాయ్స్) ఎంత పాపులరో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాండ్‌కు అభిమానులు ఉన్నారు. పాటలతో ఫ్యాన్స్‌ను అలరించిన ఈ బృందంలోని జిన్ ప్రస్తుతం దేశ సేవలో భాగం కానున్నాడు. అతను ఈరోజు దక్షిణ కొరియా సైన్యంలో చేరాడు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు అతడికి వీడ్కోలు పలికి చివరగా సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను బీటీఎస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో కింద ‘సోదరా.. క్షేమంగా తిరిగి రా’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దాంతో ఆ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ కొరియాలోని పౌరులు విధిగా సైన్యంలో చేరాలనే నియమం ఉంది. దాంతో, జిన్ ఆర్మీలో 18 నెలలు పనిచేయనున్నాడు. మరో విషయం ఏంటంటే.. మిగిలిన ఆరుగురు సభ్యులు కూడా 2025లోపు సైన్యంలో చేరనున్నారు.
జిన్ పూర్తి పేరు కిమ్ సియోక్ జిన్. సైన్యంలో చేరడానికి సిద్ధమైన జిన్ చిన్నగా జుట్టు కత్తిరించుకున్నాడు. చిన్న జుట్టుతో ఉన్న ఫొటోలను ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేశాడు. యెన్చియాన్లోని సైనికుల నియామక, శిక్షణ కేంద్రంలో జిన్ ఐదు వారాలు ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆ తర్వాత అతను సైనికుడిగా విధులు నిర్వహిస్తాడు అని దక్షిణ కొరియాకు చెందిన వార్తా సంస్థ యొన్హప్ తెలిపింది. తాను డిసెంబర్ 13వ తేదీన సైన్యంలో చేరుతున్నట్టు నవంబర్ నెలలో జిన్ ప్రకటించాడు. ఇదే విషయాన్ని బీటీఎస్‌కు చెందిన బిగ్ హిట్ మ్యూజిక్ వెల్లడించింది. ది ఆస్ట్రోనాట్ అనే పాటతో ఈ యంగ్‌స్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
우리 형 !! 잘 다녀와요!! 💜러뷰💜 pic.twitter.com/ZP6yryv2qe
— 방탄소년단 (@BTS_twt) December 13, 2022