Viral Video | బెంజ్‌కారును కాలితో తోసుకెళ్లిన ఆటో డ్రైవర్..!
Viral Video | మెర్సిడెస్ బెంజ్ కారు రద్దీ రోడ్డుపై ఆగిపోతే.. దాన్ని షెడ్డుదాకా తీసుకెళ్లేందుకు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశాడు. ఆగిపోయిన కారును ఆటో డ్రైవర్ ఎలా తీసుకెళ్లాడా..? అనే కద మీ డౌట్. బైక్, ఆటో వంటివి నడిరోడ్డుపై ఆగిపోతే మనం ఏం చేస్తాం..? మరో వాహనం సాయంతో వెనుకవైపు నుంచి కాలితో తోసుకుంటూ వెళ్తాం. ఇలాంటివి తరచూ రోడ్డుపై చూస్తుంటారు కద. అదేమాదిరిగా ఆటో డ్రైవర్ కూడా బెంజ్ కారును షెడ్డుదాకా కాలితో తోసుకుంటూ వెళ్లాడు.

పూణెలోని కోరేగావ్ పార్క్ ప్రాంతంలో గల రద్దీ రహదారిపై ఓ బెంజ్ కారు బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరైనా సాయం చేస్తారేమో అని చూశాడు. అయితే, సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అందరూ తమతమ పనులపై బిజీగా వెళ్తూ కనిపించారు. అంతలో అటుగా వచ్చి ఓ ఆటో డ్రైవర్ అక్కడ పరిస్థితిని గమనించి సాయం చేసేందుకు ముదుకొచ్చాడు. వెనుక ఆటో నడుపుతూ తన కాలితో బెంజ్‌కారును తోసుకుంటూ షెడ్డుదాగా చేర్చాడు.
ఈ తతంగాన్నంతా రోడ్డుపై వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆటో డ్రైవర్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
KP ❤️🤣
संकटकाळी मदतीला येणारा एक रिक्षावाला मित्र पाहिजेच…💪🏼 pic.twitter.com/qRpcm2F8RX— पुणेरी स्पिक्स™ Puneri Speaks (@PuneriSpeaks) December 15, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?