Viral News | విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు లగేజీ విషయంలో టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే ప్రయాణ సమయంలో వారు ఒకచోట ఉంటే.. లగేజీ మరో చోట ఉంటుంది. ఫ్లైట్ దిగి లగేజీ కోసం వెళ్తే.. బ్యాగ్స్ మారిపోవడమో, దెబ్బతినడమో జరుగుతుంది. కొందరి బ్యాగ్స్ అయితే ఏకంగా మిస్సవుతుంటాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి.
తాజాగా ఓ ప్రయాణికుడుకి వితం అనుభవం ఎదురైంది. ఫ్లైట్ దిగాక లగేజీ ఎస్కలేటర్ వద్ద తన బ్యాగ్ కోసం వెళ్లాడు. బ్యాగ్ అయితే ఉంది కానీ.. అది రోడ్డు ప్రమాదంలో తుక్కైన వాహనంలా కనిపించింది. తన బ్యాగేనా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాడు. అది తన బ్యాగే అని తేలడంతో కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.