90 ఏండ్ల వయసులో ఆ బామ్మ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా!
ఒకప్పుడు కుక్కలంటే ఇష్టం లేని బామ్మ కనక్ (90) ఇప్పుడు వీధి కుక్కల కోసం ప్రతి రోజూ ఉదయం 4.30 గంటలకే లేచి ఆహారం తయారుచేస్తోంది.
ముంబై : ఒకప్పుడు కుక్కలంటే ఇష్టం లేని బామ్మ కనక్ (90) ఇప్పుడు వీధి కుక్కల కోసం ప్రతి రోజూ ఉదయం 4.30 గంటలకే లేచి ఆహారం తయారుచేస్తోంది. తన మనమరాలు సనా ఓ కుక్కను తీసుకువచ్చిన తర్వాతే తనలో ఈ మార్పు వచ్చిందని హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో షేర్ అయిన వైరల్ వీడియోలో కనక్ చెప్పుకొచ్చారు. పెంపుడు కుక్కకు కొకో అని పేరు పెట్టుకున్నామని ఇప్పుడు దానితోనే తన ప్రపంచమని కనక్ చెబుతున్నారు.
అసలు కుక్కలంటే తనకు ఇష్టం లేదని, కొన్నేండ్ల కిందట సనా కొకోను తీసుకువచ్చిన తర్వాతే దానిలో ప్రేమలో పడిపోయానని ఇప్పుడు కొకోతోనే తన రోజు ప్రారంభమై దానితోనే రోజు ముగుస్తోందని తెలిపారు. కొకో తినడం, ఆడుకోవడం, బద్దకంగా తిరగడం చేస్తుంటుందని, తాను దాన్ని చూస్తూ పొద్దుపుచ్చుతుంటానని చెప్పారు. కొకోకు తన హృదయాన్ని ఇచ్చేసానని చెబుతున్న బామ్మ కొకోతో పాటు తమ వీధిలోని ఇతర కుక్కలకు ఆహారం సిద్ధం చేయడానికి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు.
కనక్ మనవరాలికి కుక్కలంటే ప్రాణం. వీధి కుక్కల కోసం ఆమె ఓ షెల్టర్‌ను ఏర్పాటు చేసి వాటికి వ్యాక్సినేషన్ కూడా చేయిస్తారు. రెండేండ్లుగా తాను ప్రతిరోజూ కుక్కల కోసం వండివార్చిన ఆహారాన్ని తన చేతులతోనే వాటికి తినిపిస్తానని బామ్మ కనక్ చెబుతున్నారు. 90 ఏండ్ల వయసులో తాను చేస్తున్న ఈ పని సాహసానికి ఏ మాత్రం తక్కువ కాదంటారా అని ఆమె ప్రశ్నిస్తోంది. ముదిమి వయసులో బామ్మ చేస్తున్న కృషిని కుక్కల పట్ల చూపే ఔదార్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- cook
- Stray dogs
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

