ఉదయం చదువు… సాయంత్రం ఉద్యోగం.. స్ఫూర్తిదాయకం ఈ చిన్నోడి ఆరాటం
ఆటుపోట్లను ఎదుర్కోవడం ఎలా అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకున్న వారు పెద్దయ్యాక గొప్పగా ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. అలా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు ఈ ఏడేండ్ల ఫుడ్ డెలివరీ బాయ్.
వయసు చిన్నదైనా కొందరు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. జీవితం మనకు పోరాట పటిమను నేర్పిస్తుంది. ఆటుపోట్లను ఎదుర్కోవడం ఎలా అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకున్న వారు పెద్దయ్యాక గొప్పగా ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. అలా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు ఈ ఏడేండ్ల ఫుడ్ డెలివరీ బాయ్.
ఆహార పదార్థాలను చేరవేసే సంస్థల్లో ఎందరో డెలివరీ బాయ్‌లుగా పనిచేస్తుండటం మనం చూస్తున్నాం. అయితే, కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైన సందర్భంలో ఆయన బాధ్యతను తలకెత్తుకున్నాడీ కుర్రోడు. ఉదయం వేళ బుద్ధిగా స్కూల్కెళ్లి చదువుకుంటారు. సాయంత్రం వేళ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నాడు. ఈ బాయ్ కథనాన్ని వీడియోగా తీసి రాహుల్ మిట్టల్ అనే వ్యక్తి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 40 వేల మంది వీక్షించారు.
తండ్రి ఓ ప్రమాదానికి గురై మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉండగా.. ఆయన బాధ్యతల్లో కొంత తన భుజంపై వేసుకున్నాడు ఈ ఏడేండ్ల చిన్నోడు. ఉదయం పూట స్కూల్కెళ్లి చదువుకుంటానని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు రాహుల్ మిట్టల్ పోస్ట్ చేసిన వీడియోలో పిల్లోడు చెప్పుకొచ్చాడు.
ఈ వీడియోను వీక్షించిన పలువురు నెటిజెన్లు ఎమోషనల్‌గా ఫీలవుతూ.. ఈ కుర్రోడు మనకందరికీ స్ఫూర్తిదాయకం అని కామెంట్ చేశారు. చాలా మంది ఈ బాలుడికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇలా చిన్న పిల్లాడితో సేవలు చేయించుకోవడానికి బదులుగా.. ఆయన చదువుకు సాయం చేయడానికి జొమాటలో ముందుకు రావాలని రాహుల్ మిట్టల్ సూచిస్తున్నాడు. నిజమే కదా! చైల్డ్ లేబర్ అపవాదు రాకముందే జొమాటో చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

