Hyderabad to GOA Tour | 9 వేలకే గోవా ట్రిప్.. తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ
Telangana Tourism GOA tour | సమ్మర్ వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే ప్లేస్ గోవా. ఇక్కడి అందమైన బీచ్‌లతో పాటు చర్చిలు, క్యాసినోలు, రిసార్ట్లు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే గోవా వెళ్లే పర్యాటకులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది
Hyderabad to GOA tour | సెలవులొచ్చాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్ని ఎండలుంటే ఏంటి సమ్మర్ టూర్లు వేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు కదా! ఇక మనలో చాలామంది కూడా సమ్మర్ వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే ప్లేస్ గోవా. ఇక్కడి అందమైన బీచ్‌లతో పాటు చర్చిలు, క్యాసినోలు, రిసార్ట్లు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే గోవా వెళ్లే పర్యాటకులకు తెలంగాణ టూరిజం (Telangana Tourism) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
హైదరాబాద్ టూ గోవా (Hyderabad to Goa Tour Package) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి సోమవారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో మపుసా సిటీ (Mapusa City), లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్ (Lord Bodgeshwar Temple), ఫోర్ట్ అగ్వాడా (Fort Aguada), బాగా బీచ్ (Baga beach), కలంగుట్ బీచ్ (Calangute Beach), వాగేటర్ బీచ్ (Vagator Beach) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది. ప్రతి సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ నుంచి గోవాకు బస్సు అందుబాటులో ఉంది.
ప్రయాణం సాగుతుంది ఇలా
Day 01: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. బషీర్‌బాగ్ నుంచి మధ్యాహ్నం 2:00 గంటలకు బస్సులో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది. (రాత్రి భోజనం ఉంటుంది)
Day 02: రెండో రోజు ఉదయం 6 గంటలకు గోవాలోని హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్)కు చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం ఉదయం 10.00 గంటల నుంచి నార్త్ గోవాలోని మపుసా సిటీ (Mapusa City), లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్ (Lord Bodgeshwar Temple), ఫోర్ట్ అగ్వాడా (Fort Aguada), బాగా బీచ్ (Baga beach)ల సందర్శన ఉంటుంది. రాత్రి భోజనం, హోటల్లో బస ఉంటుంది.
Day 03: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత సౌత్ గోవాలోని డోనా పౌలా బీచ్ (Dona Paula Beach), మిరామార్ (Miramar, Gasper Dias beach), పాత గోవా చర్చిలు (Old Goa Churches), మంగూషి దేవాలయాలు (Mangueshi Temples), కొల్వా బీచ్ (Colva beach), మార్డోల్ బీచ్ (Mardol beach) సందర్శనకు వెళ్తారు.
అదే రోజు సాయంత్రం సొంత ఖర్చుతో క్రూజ్ బోట్లో జర్నీఉంటుంది( ఒక్కొక్కరికి రూ.500). తర్వాత తిరిగి హోటల్ కి చేరుకుంటారు.
Day 04: నాలుగో రోజు హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్) నుంచి ఉదయం 11.00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. 5వ రోజు ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ గోవా టూర్ ప్యాకేజీ ధర
hyd goa tour cost | సింగిల్ షేరింగ్ కు రూ. 14, 900 ధర ఉండగా.. అడల్ట్స్‌కు రూ. 9,900 ధరగా ప్రకటించారు. చిన్నారులకు రూ.7,920గా ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. బుకింగ్స్ కోసం 9848540371 నంబర్ని సంప్రదించాలని తెలంగాణ టూరిజం తెలిపింది.
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/goatour
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

