IRCTC Ganga Ramayan Yatra | హైదరాబాద్ నుంచి కాశీ యాత్ర.. 6 రోజుల టూర్ డీటెయిల్స్ !
GANGA RAMAYAN YATRA | సమ్మర్ వచ్చిందంటే చాలు... సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే... మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అలాంటి వారికోసం ఐఆర్సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.
IRCTC GANGA RAMAYAN YATRA | సమ్మర్ వచ్చిందంటే చాలు… సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే… మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అలాంటి వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి ‘గంగా రామాయణ్ యాత్ర’ (Ganga Ramayan Yatra) పేరిట టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra) పేరిట ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తుండగా.. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి ఆయా ప్రాంతాలను చూపిస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజ్… మే 25 తేదీన అందుబాటులో ఉంది. ఇందులో అయోధ్య (Ayodhya), ప్రయాగ్ రాజ్ (Prayag raj), సార్నాథ్ (Saranaath), వారణాసి (Varanasi) తో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.
ఐఆర్సీటీసీ గంగా రామాయణ్ యాత్ర ప్రయాణం ఇలా..
Day 01: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ విమానాశ్రయం (Hyderabad RGIA Airport) నుండి ఉదయం 9:30 గంటలకు బయలుదేరుతుంది. వారణాసి విమానాశ్రయానికి 11:25 కి చేరుకుంటారు. అనంతరం హోటల్లో చెకిన్ అవ్వాలి. భోజనం తర్వాత కాశీ దేవాలయం మరియు గంగా ఘాట్ (Ganga Ghat) సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసి (Varanasi)లో రాత్రి బస ఉంటుంది.
గమనిక : వారణాసి ఘాట్లు, ఆలయానికి బస్సులు అనుమతి లేదు. పర్యాటకులు ఆలయం, ఘాట్లను సందర్శించడానికి వారి స్వంత ఖర్చులతో ఆటో-రిక్షాలలో ప్రయాణం చేయాలి.
Day 2 : రెండో రోజు సారనాథ్ (SARNATH) సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి వారణాసికి చేరుకుంటారు. బిర్లా ఆలయం సందర్శన ఉంటుంది. అనంతరం ఘాట్లను సందర్శించడం లేదా సొంతంగా షాపింగ్ చేయొచ్చు. భోజనం తర్వాత రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
Day 3 : మూడో రోజు హోటల్ నుంచి చెకౌట్ చేయాలి. ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శన ఉంటుంది. సాయంత్రం అయోధ్య(Ayodhya)కు బయలుదేరుతారు. హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. భోజనం తర్వాత రాత్రి అయోధ్యలో బస ఉంటుంది.
Day 4 : నాలుగో రోజు అయోధ్య ఆలయాన్ని సందర్శన. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకి బయలుదేరాలి. అక్కడ హోటల్లో దిగాలి. లక్నోలో రాత్రి బస ఉంటుంది.
Day 5 : ఐదో రోజు నైమిశరణ్యాన్ని దర్శనం. సాయంత్రం తిరిగి లక్నో రావాల్సి ఉంటుంది. లక్నోలో రాత్రి బస చేస్తారు.
Day 6 : ఆరో రోజు బారా ఇమాంబరా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ని సందర్శన ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయంలో ఫ్లైట్ ఉంటుంది. అక్కడ నుంచి రాత్రి 8:00 వరకు హైదరాబాద్ వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధర ( Ganga Ramayan Yatra Tour Package)
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 36,850 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.29,900, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.28,200. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ (Travel Insurance) కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA10
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

