కేసీఆర్ పూడిక తీసిన చెరువుకు జలకళ.. మత్తడి దూకుతున్న చందుపట్ల రాసముద్రం

నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ): మిషన్‌కాకతీయ పథకానికి శ్రీకారం చుడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా పూడిక తీత పనుల్లో పాల్గొన్న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల చందుపట్ల రాసముద్రం చెరువు జలకళ సంతరించుకుంది. 201 5 ఏప్రిల్ 26న కేసీఆర్ చందుపట్లకు వచ్చి ఎండ్ల బండిపై చెరువులోకి చేరుకున్నారు. తానే స్వయంగా పలుగు పార పట్టి పూడికతీత పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించిన చందుపట్ల రాస ముద్రం చెరువు ప్రస్తుతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది.

సోమవారం అర్ధరాత్రి నుంచి అలుగు పారుతుంది. సుమారు 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువును కాకతీయుల కాలంలో నిర్మించగా దానిని సమైఖ్యపాలనలో పట్టించుకోలేదు. దీంతో రాసముద్రంగా పిలిచే ఈ చెరువు నుంచే కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి నుంచి ప్రతీ ఏటా చెరువుకు వరద వచ్చి చేరుతుంది. ఈ ఏడాది కూడా చెరువు మత్తడి దూకుతుండడంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

