18 ఏండ్లు దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు!

- కాదనటానికి ఎలాంటి కారణం లేదన్న సుప్రీంకోర్టు
- మతమార్పిళ్లను నిరోధించాలన్న పిటిషన్ కొట్టివేత
- పిటిషనర్, లాయర్‌పై ఆగ్రహం.. ఫైన్ విధిస్తామని హెచ్చరిక
- కాదనటానికి ఎలాంటి కారణం లేదు: సుప్రీంకోర్టు
- మతమార్పిళ్లను నిరోధించాలన్న పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారతదేశంలో 18 ఏండ్లు నిండిన ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, అనుసరించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను, చేతబడి వంటి తాంత్రిక విద్యలను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకునేలా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ స్పష్టతనిచ్చింది. జస్టిస్‌లు ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయి, హృషికేశ్ రాయ్‌తో కూడిన బెంచ్ దీనిపై శుక్రవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్‌ను దాఖలు చేసినందుకు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్, ఆయన తరుఫున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ శంకరనారాయణపై ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆర్టికల్ 32 ప్రకారం ఇది ఏ రకమైన పిటిషన్? ఇలాంటి పిటిషన్‌ను దాఖలు చేసినందుకు మీపై భారీ జరిమానా విధిస్తాం’ అని గోపాల్ శంకరనారాయణను ఉద్దేశిస్తూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. 18 ఏండ్లు నిండిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించకూడదు అనడానికి ఎలాంటి కారణం లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతినివ్వాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి న్యాయస్థానం నిరాకరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
పిటిషన్లో ఏమున్నది?
బలవంతపు మతమార్పిడులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 25 కింద నేరం. బలవంతపు మతమార్పిళ్లను, తాంత్రిక విద్యలను కట్టడి చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి’ అని అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మతమార్పిడులతో మత సామరస్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీని నియమించాలన్నారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
- Tags
- freedom
- religion
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

