జగిత్యాల: అతడో జెడ్పీ సూల్‌కి హెడ్మాస్టర్ (Headmaster). విద్యార్థులకు మంచీచెడులు చెప్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత అతనిది. పిల్లలు చెడుదారులు పట్టకుండా చూడాల్సిన అతడే దారితప్పాడు. తాను అశ్లీల చిత్రాలు చూడటమే కాకుండా ఓ గ్రూప్‌లో వాటికి సంబంధించిన లింక్‌ను షేర్ చేశాడు. ఇంకేముందు విషయం పై అధికారుల వరకు వెళ్లింది. దీంతో వారు ఆ హెడ్మాస్టర్ను సస్పెండ్ చేశారు.
చంద్రహరి.. జగిత్యాల జిల్లాలోని దొంతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అశ్లీల చిత్రాల లింక్‌ను సోషల్ మీడియాలోని హెడ్మాస్టర్ల గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశాడు. దీంతో జిల్లా విద్యాధికారి (డీఈఓ) చంద్రహరిపై విధుల నుంచి తొలగించాడు.