ప్రియుడి వేధింపులకు యువతి బలి
తనను ప్రేమించిన గ్రామీణ వైద్యుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకున్నది.
- చనువుగా ఉన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్
- మనస్తాపంతో ఆత్మహత్య
- ఖమ్మం జిల్లాలో విషాదం
కారేపల్లి, నవంబర్ 14: తనను ప్రేమించిన గ్రామీణ వైద్యుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కారేపల్లి మండ లం రేలకాయలపల్లికి చెందిన జర్పు ల సందీప్తి (20) డిగ్రీ చదువుతున్నది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ నామా నరేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకోవాలని భావించారు. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ఇంతలో వీరి ప్రేమ వ్యవహారం ఆ యువతి ఇంట్లో తెలిసింది. ఆమె తల్లిదండ్రులు సందీప్తిని కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచుతున్నారు.
దీంతో నరేశ్ కూడా భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఓ రోజు ఆమెకు ఫోన్ చేసి, తల్లిదండ్రులకు భయపడకుండా తనను పెండ్లి చేసుకోవాలంటూ ఒత్తి డి చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆమెపై కోపం పెంచుకున్న నరేశ్.. వారిద్దరూ గతంలో చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. సోషల్ మీడియాలోనూ పోస్టుచేశాడు. ఆర్ఎంపీ తనను వేధిస్తున్నాడంటూ ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 6న కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలో తాము కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తన కుటుంబ పరువు పోయిందని భావించిన సందీప్తి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. తరువాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కారేపల్లి పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

