యువతికి నిప్పంటించిన ఉన్మాది.. చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ యువతిపై లైంగికదాడికి నిరాకరించదన్న నెపంతో ఓ ఉన్మాది యువతికి నిప్పంటించాడు. తీవ్ర కాలిన గాయాలతో సదరు యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని ఓ మండల కేంద్రంలోని ఆసుపత్రి వెనుకభాగం నుంచి యువతి అరుపులు వినిపించాయి. దీంతో అక్కడే స్థానికులు అక్కడికి వెళ్లి చూసే సరికి ఓ యువతి ఒంటినిండా కాలిన గాయాలతో కనిపించగా.. జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.
యువతిని దవాఖానకు తరలించే క్రమంలో స్థానికులు ఆమె ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చారు ? ఏం జరిగింది ? సమాచారం సేకరించారు. ఓ వ్యక్తి తనను ఇక్కడకు తీసుకువచ్చాడని, వ్యక్తి ఫోన్ నంబరుతో పేరు, ఊరు వివరాలు వెల్లడించింది. ఇక్కడికి తీసుకువచ్చి తనపై లైంగిక దాడి చేయగా.. ప్రతిఘటించడంతో నిప్పంటించాడని మృతులు చెప్పిందని స్థానికులు తెలిపారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. సదరు నిందితుడిని వెంకట్రాములుగా గుర్తించారు. యువతి ఆరోగ్య పరిస్థితి ఇవాళ ఉదయం విషమించడంతో మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతురాలిని మద్దూరు మండలానికి చెందిన యువతిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడితో పాటు యువతి హైదరాబాద్‌లో ఉంటున్నారని, యువతి అదృశ్యమైందని ఓ పోలీస్‌స్టేషన్ కేసు నమోదైనట్లు తెలుస్తున్నది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

