మోదీపై యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతోనే ఆగదు : యశ్వంత్ సిన్హా
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు పడతాయి. అందులో సందేహం లేదు. కానీ, విషయం అదికాదు. ఈ యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతో ముగియదు. తరవాత కూడా కొనసాగుతుందని యశ్వంత్ సిన్హా తేల్చిచెప్పారు. తనకు తెలంగాణలో ఇంత ఘన స్వాగతం లభిస్తుందని ఊహించలేదు.. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ అని యశ్వంత్ సిన్హా అన్నారు.
హైదరాబాద్ జలవిహార్‌లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన మద్దతు సభలో సిన్హా పాల్గొని ప్రసంగించారు. దేశంలో పీపుల్స్ మూమెంట్ మొదలైందన్నారు. టీఆర్ఎస్ తరపున కేటీఆర్ ఢిల్లీ రావడం తనకు మరింత బలం చేకూరిందన్నారు. రాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు- ఇద్దరి ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ అని పేర్కొన్నారు. దృఢమైన సంకల్పంతో వెళ్తే విజయం తథ్యమని తాను నమ్ముతానని యశ్వంత్ స్పష్టం చేశారు.
కేసీఆర్ విజన్ బాగుంది..
మోదీపై పోరాటం రాష్ట్రపతి ఎన్నికతోనే ఆగదు.. తరువాత కూడా కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ను కలుపుకొని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ విజన్ బాగుంది.. దాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు. తమ పోరాటం భారత భవిష్యత్ కోసమేనని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మూలాలను రక్షించడానికి తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతి పదం వాస్తవమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్లో కొట్లాడారు. కేసీఆర్ తన స్వప్నం నెరవేర్చుకున్నారు.. కానీ అక్కడితో ఆగకుండా తెలంగాణను దేశంలో నెంబర్ గా నిలిపారని యశ్వంత్ సిన్హా ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

