స్వర్ణకాంతుల్లో యాదాద్రి ఆలయం
స్వర్ణకాంతుల్లో యాదాద్రి | శనివారం సాయంత్రం యాదాద్రిలో లైటింగ్ డెమో నిర్వహించారు. స్వర్ణకాంతులతో లక్ష్మినరసింహ స్వామి ఆలయం విరాజిల్లుతోంది.

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మిస్తున్న యాదాద్రి క్షేత్రం వడివడిగా రూపుదిద్దుకుంటోంది. ఒక్కో పనిని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. శనివారం సాయంత్రం యాదాద్రిలో లైటింగ్ డెమో నిర్వహించారు. స్వర్ణకాంతులతో లక్ష్మినరసింహ స్వామి ఆలయం విరాజిల్లుతోంది. స్వర్ణకాంతుల్లో మెరిసిపోతున్న ఆలయ సుందర దృశ్యాలను స్థానికులు తమ కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం చోళ, కాకతీయ, పల్లవ శిల్ప కళాకృతులతో… మరెక్కడా లేని తరహలో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దాల తరబడి రాతి చెక్కడాలు జరగాల్సిన పనులను కేవలం నాలుగేళ్లలో దాదాపు పూర్తయ్యాయి. ప్రధాన ఆలయాన్ని 2.33 ఎకరాల విస్తీర్ణంలో ఆగమ ,శిల్ప వాస్తు శాస్త్రాల ప్రకారం సంపూర్ణంగా కృష్ణ శిలతో రూపొందించారు.
దాదాపు 2.5 లక్షల టన్నుల నల్ల రాతితో అష్ట భుజ మండప ప్రాకారాలు, కాకతీయ కళా రూపాలు, యాలి స్తూపాలు రూపొందించారు. అష్టలక్ష్మి రూపాలతో సాలహారాలు, ఆళ్వారుల విగ్రహాలు, ప్రహ్లాద చరితం… ఉప ఆలయాలతో భక్త జనులను మైమరిపించేట్లు యాదాద్రిశుడి సన్నిధి ఆధ్యాత్మిక నిలయంగా మారింది. మాడ వీధులతో 4.3 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణం రూపొందింది.
నలువైపుల ఆరు రాజ గోపురాలు నిర్మితమయ్యాయి. ఆలయ వాస్తు నిర్మాణ శాస్త్రంలో 16 రకాల గోపురాలుంటే వాటిలో మూడు రకాల గోపురాలు ఒకేఒక్క యాదాద్రి బృహద్ధాలయంలో ఉన్నాయి. ఈ గోపురాలపై మహావిష్ణువుకు సంబంధించిన 257 విగ్రహాలను పొందు పరిచారు. ఆలయ తొలి ప్రాకారంలో నలువైపులా 93 సాలహారాలు, రెండవ ప్రాకారంలో 52, మాడ వీధిలో 96 సాలహారాలను దేవత మూర్తులు, అష్టలక్ష్మి దేవి రూపాలతో తీర్చిదిద్దుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

