బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 11:52:24

హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ వర్సిటీ : కేటీఆర్‌

హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ వర్సిటీ : కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ కేటీఆర్‌ తెలిపారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా-2020 ప్రదర్శనకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎఫ్‌ఐసీసీఐ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహణ జరుగుతోంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏవియేషన్‌ ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. వింగ్స్‌ ఇండియా ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్‌ ప్రదర్శన అన్నారు. కరోనా భయంతో వింగ్స్‌ ఇండియా నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. కానీ తగు జాగ్రత్తలు, దృఢ నిశ్చయంతో ప్రదన్శనను సుసాధ్యం చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ర్టానికి ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ ప్రాధాన్యత రంగాలన్నారు. తెలంగాణ వేగంగా వృద్ధి చెందుతోన్న రాష్ట్రమని తెలిపారు. రాష్ట్రంలో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదించినట్లుగా చెప్పారు. భద్రాద్రి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ గుదిబండలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి అవకాశం ఉందన్నారు. అదేవిధంగా వరంగల్‌ విమానాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు.logo