Hyderabad | ఇన్స్టాగ్రామ్లో రేటింగ్ పేరుతో మోసం.. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా టెక్కీ
Hyderabad | ఆన్లైన్లో వచ్చే లింక్స్, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ కోటిన్నర వరకు పోగొట్టుకుంది.
Hyderabad | ఆన్లైన్లో వచ్చే లింక్స్, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ కోటిన్నర వరకు పోగొట్టుకుంది.
ఇన్స్టాగ్రామ్లో తాము సూచించిన పేజీలకు రేటింగ్ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు హైదరాబాద్కు చెందిన ఓ మహిళా టెక్కీకి ఆశజూపారు. అది నమ్మిన టెక్కీ అందుకు ఒప్పుకుంది. వాళ్లు చెప్పిన పేజీలకు రేటింగ్ ఇచ్చినందుకు మొదట కొంత నగదు కూడా చెల్లించి ఆమెను నమ్మించారు. ఆ తర్వాత తమతో పాటు పెట్టుబడి పెడితే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చని నమ్మబలికారు. వాళ్ల మాయమాటలు నమ్మిన సదరు టెక్కీ పెట్టుబడి కింద డబ్బులు చెల్లించింది. అలా విడతలవారీగా రూ.1.50 కోట్లను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకుంది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

