లింగాలఘనపురం, డిసెంబర్ 5 : నా ఆధార్ కార్డులో ఉన్న పేరు.. వ్యవసాయ శాఖ రికార్డులో ఉన్న పేరు ఒక్కటే. కేవలం ఇంటిపేరులో రెండక్షరాలు తేడాగా ఉన్నాయి.. కేసీఆర్ సారు హయాంలో ఈ ఆధార్ కార్డుతోనే ఏడుసార్లు రైతు బంధు డబ్బులు ఠంచన్‌గా పడ్డాయి. రుణమాఫీ కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. నా పేరులో తప్పుందని రుణమాఫీని ఆపింది.
నేను జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నవాబుపేటలోని కెనరా బ్యాంకులో రూ. 40 వేలు పంట రుణం తీసుకున్నా. నా ఆధార్ కార్డులో ఇంటిపేరు బొల్లంపెల్లిలో పీఈఎల్ఎల్వై ఉండగా, వ్యవసాయశాఖ ఆన్లైన్ రికార్డుల్లో మాత్రం పీఏఎల్ఎల్ఐ (పల్లి)గా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంల ఎట్లిచ్చిండ్రు.. ఇప్పుడెందుకు ఇత్తలేరో తెలియడంలేదు అంటూ సుజాత తన ఆవేదన వ్యక్తంచేసింది.