‘ఫోన్ ట్యాపింగ్’ రిపోర్టును ఎందుకివ్వలేదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, మీడియా ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేయకపోవడంపై కోర్టు ప్రశ్నించింది.
- పోలీసు అధికారులపై కోర్టు ఆగ్రహం
నాంపల్లి కోర్టులు, జులై 26 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, మీడియా ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేయకపోవడంపై కోర్టు ప్రశ్నించింది. రిపోర్టు వేసేందుకు కొంత సమయం కావాలని 207 సీఆర్పీసీ కింద ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్‌ను కోర్టుకు దాఖలు చేశారు. దీంతో ఈ నెల 31 వరకు నిందితుల రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును శుక్రవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. అభియోగపత్రంలోని కొన్ని పత్రాలు నిందితులకు అందలేదని, వాటిని అందించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
నేడు శ్రీవారి సేవ ఆన్లైన్ కోటా విడుదల
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి సేవ ఆన్లైన్ కోటాను టీటీడీ శనివారం విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు తిరుమల- తిరుపతి శ్రీవారి సేవ కోటా అందుబాటులోకి వస్తుంది. శ్రీవారి నవనీతసేవ మధ్యాహ్నం 12 గంటలకు, ఒంటిగంటకు పరకామణిసేవ ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు https ://ttdevasthanams. ap. gov. in వెబ్సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

