Minister KTR | మోదీజీ మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి..?: మంత్రి కేటీఆర్
మోదీగారు (PM Modi) మూడు రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రధానిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రశ్నించారు.
హైదరాబాద్: మోదీగారు (PM Modi) మూడు రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రధానిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?, బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు?, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు? అంటూ ఈ మూడు విభజన హక్కులకు దిక్కేదని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిలదీశారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర, మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ కడిగిపారేశారు.
కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారని, లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారని విమర్శించారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని, దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ పదేండ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారన్నారు.
2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు, దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామన్నారు, మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా అని ప్రశ్నించారు. మీ పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందన్నారు. ఎన్నికల వేళ ఇప్పుడు హంగామా చేస్తున్నారని, మరి అది అమలు అయ్యేది ఎప్పుడోనని ఎద్దేవా చేశారు.
ప్రధానిగా మీ పదేండ్ల పాలనలో అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటని ప్రశ్నించారు. మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని, మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అన్నారు.
ప్రధాని @narendramodi గారు…
మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…???1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?
2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?
3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?
మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ…
— KTR (@KTRBRS) October 3, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

