హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులకు( Retired Employees ) వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శి ( Financial Secretary ) పై తెలంగాణ హైకోర్టు ( High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకైనా కోర్టులోనే ఉంటాము . ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలను దిక్కరించిన ఆర్థిక కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం వారి పిటిషన్‌కు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ విచారిస్తూ సోమవారం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆర్థిక కార్యదర్శికి ఆదేశించినప్పటికీ, కోర్టుకు రాకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ముందే తెలుసు కదా. రాలేనని ముందే చెప్తే మినహాయింపు ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఎంత రాత్రయినా ఆర్థిక కార్యదర్శి కోర్టులో హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.